NCERT Recruitment 2021: ఎన్‌సీఈఆర్‌టీలో 14 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో..?

NCERT Recruitment 2021: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కు (NCERT) సంబంధించిన సైన్స్ అండ్ మేధమేటిక్స్ ఎడ్యుకేషన్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. 55 శాతం మార్కులతో మాస్టర్స్ […]

Written By: Navya, Updated On : September 6, 2021 10:32 am
Follow us on

NCERT Recruitment 2021: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కు (NCERT) సంబంధించిన సైన్స్ అండ్ మేధమేటిక్స్ ఎడ్యుకేషన్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. న్యూఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ను కలిగి ఉండటంతో పాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో నెట్ అర్హత సాధించిన వాళ్లకు 25,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లలో నాన్ నెట్ అభ్యర్ధులకు 23,000 రూపాయలు లభిస్తాయి. ఆన్ లైన్ ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టింగ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

desmrecruitment@gmail.com కు దరఖాస్తులను పంపాల్సి ఉండగా ఈ ఈమెయిల్ ద్వారానే ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. https://ncert.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.