https://oktelugu.com/

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఫార్మ్‌ డి) ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్ – 01, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫిజియాలజీ) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ క్యాంపస్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 24, 2022 / 10:40 AM IST
    Follow us on

    ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఫార్మ్‌ డి) ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్ – 01, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫిజియాలజీ) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    హైదరాబాద్ క్యాంపస్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఫార్మ్‌డీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది.

    డైరెక్టర్‌, ఐసీఎంఆర్‌-నిన్‌, తార్నాక, హైదరాబాద్‌ – 500007 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.

    2022 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.nin.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.