నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. 162 మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 162 ఉద్యోగ ఖాళీలలో అన్ని ఉద్యోగ ఖాళీలకు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. జులై 17వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఉద్యోగాలలో 155 అసిస్టెంట్ మెనేజర్ ఉద్యోగ ఖాళీలు కాగా 7 మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. https://nabard.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుంది. నోటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.