https://oktelugu.com/

విరాట్ కోహ్లీ-అనుష్కల బాడీ గార్డ్ జీతం తెలిస్తే షాకే?

ఎవరైనా ప్రాణంగా నమ్మితే ఎంతైనా ఇస్తారు.. బాలీవుడ్ హీరోయిన్ కం టీమిండియా కెప్టెన్ అనుష్క శర్మ కూడా అంతే. తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి తనవెంటే ఉన్న బాడీగార్డ్ కోసం ఎంతైనా చేస్తుందట.. ఎంతగా అంటే ఒక సీఈవోకు ఇచ్చేంత జీతం ఇచ్చి మరీ అతడిని తన బాడీగార్డుగా పెట్టుకుంటోందట.. అనుష్క శర్మ బాలవుడ్ లోకి వచ్చిన కొత్తలో ఆమెకు రక్షణ కోసం ప్రకాష్ సింగ్ సోనూ అనే బాడీ గార్డును పెట్టుకుంది. పెళ్లి అయ్యాక కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2021 / 08:39 PM IST
    Follow us on

    ఎవరైనా ప్రాణంగా నమ్మితే ఎంతైనా ఇస్తారు.. బాలీవుడ్ హీరోయిన్ కం టీమిండియా కెప్టెన్ అనుష్క శర్మ కూడా అంతే. తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి తనవెంటే ఉన్న బాడీగార్డ్ కోసం ఎంతైనా చేస్తుందట.. ఎంతగా అంటే ఒక సీఈవోకు ఇచ్చేంత జీతం ఇచ్చి మరీ అతడిని తన బాడీగార్డుగా పెట్టుకుంటోందట..

    అనుష్క శర్మ బాలవుడ్ లోకి వచ్చిన కొత్తలో ఆమెకు రక్షణ కోసం ప్రకాష్ సింగ్ సోనూ అనే బాడీ గార్డును పెట్టుకుంది. పెళ్లి అయ్యాక కూడా విరాట్ కోహ్లీ సైతం అతడి మంచి తనం చూసి కొనసాగించాడు.

    కరోనా సెకండ్ వేవ్ లో వీరిద్దరూ కరోనా బారిన పడితే ప్రకాష్ సింగ్ ఏకంగా పీపీఈ కిట్ ధరించి మరీ వీరిద్దరి స్వయంగా ఆస్పత్రిలో చేర్పించాడట.. దగ్గరుండి వారికి అవసరమైన మందులు, చికిత్స చేయించి ప్రాణాలు తెగించి వారికి అండగా నిలిచాడట..

    అందుకే అనుష్క విరాట్ సొంత కుటుంబ సభ్యుడిలా ప్రకాష్ సింగ్ సోనూను చూస్తారట.. అతడి బర్త్ డేను ప్రతీసంవత్సరం జరుపుతారట.. ఏకంగా అతడికి ఒక సీఈవో కు ఇచ్చిన సాలరీ లాగా రూ.1.2 కోట్లు సంవత్సరానికి చెల్లిస్తారట.. ఈ క్రేజ్ కపుల్ ఇప్పుడు ఎక్కడ బయటకు వెళ్లినా ప్రకాష్ సింగ్ వారి వెంట ఉంటాడు. బలిష్టంగా బాడీ బిల్డర్ లా ఉండే అతడు విరాట్-అనుష్కలను వెన్నంటే నీడలా ఉంటాడు. ఇన్నేళ్లు వారు అతడిని కొనసాగించాడంటే అతడి మంచితనం అర్థం చేసుకోవచ్చు.