https://oktelugu.com/

Jobs in Bank of India: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీవేతనంతో జాబ్స్.. పరీక్ష లేకుండా?

Jobs in Bank of India:  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. మొత్తం 25 స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. గ్రాడ్యుయేషన్‌/తత్సమాన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2021 / 09:22 AM IST
    Follow us on

    Jobs in Bank of India:  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. మొత్తం 25 స్పెషలిస్ట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    Jobs in Bank of India

    గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత ఉండటంతో పాటు కంప్యూటర్‌ కోర్సులో సర్టిఫికేట్‌ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాటికి 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read:  నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరుగుతుంది. విద్యార్హతలు, అనుభవం ఆధానంగా ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    https://www.bankofindia.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

    Also Read: Jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో జాబ్స్.. రాతపరీక్ష లేకుండా?