Kcr In Telangana: కేసీఆర్ అలా చేస్తే ఇక ముందస్తు ఎన్నికలు లేనట్లే..!

Kcr In Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నా..రాష్ట్రంలో ఇప్పుడే రాజకీయ వేడి సంతరించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోనూ పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రనాయకులు వ్యూహం పన్నుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీ పెద్దలను రాష్ట్ర నాయకులు కలిసినప్పడు అమిత్ మాట్లాడిని విషయం తెలిసిందే. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని.. బహిరంగంగానే చెప్పారు. దీంతో 2018 మాదిరిగానే ఇప్పుడు కూడా కేసీఆర్ […]

Written By: NARESH, Updated On : December 29, 2021 12:00 pm

KCR

Follow us on

Kcr In Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నా..రాష్ట్రంలో ఇప్పుడే రాజకీయ వేడి సంతరించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోనూ పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రనాయకులు వ్యూహం పన్నుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీ పెద్దలను రాష్ట్ర నాయకులు కలిసినప్పడు అమిత్ మాట్లాడిని విషయం తెలిసిందే. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని.. బహిరంగంగానే చెప్పారు. దీంతో 2018 మాదిరిగానే ఇప్పుడు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా..? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Kcr In Telangana:

అయితే ఇటీవల మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల ఎమ్మెల్సీ పదవులకు ప్రమాణం స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో కొందరు కొత్తవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. వారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేబినేట్ నుంచి ఈటల రాజేందర్ ను బర్త్ రఫ్ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయన స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్ ను భర్తీ చేస్తారని అంటున్నారు. మరోవైపు కేసీఆర్ దగ్గరే ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పదవిని వెంకట్రామిరెడ్డికి ఇస్తారని అంటున్నారు.

 

Also Read:  బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్? వరిని వాడుకుని పన్నాగాలు పన్నుతున్న సీఎం?

ఈమధ్య కేబినెట్ విస్తరణ జరిగి మంత్రి పదవులను కేటాయిస్తే కేసీఆర్ ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. కేబినెట్ విస్తరణ చేయకపోతే ఇక ముందస్తు ఆలోచన ఉన్నట్లే నని చర్చించుకుంటున్నారు. కానీ స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమ పార్టీ నాయకులకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీని ఇప్పటి నుంచే గాడిలో పెడితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదని సూచించారు.

ఈ నేపథ్యంలో ఎవరికీ అర్థంకాని వ్యూహం రచించే కేసీఆర్ కేబీనేట్ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది. అయితే హూజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత కేసీఆర్ స్పీడును పెంచినట్లు తెలుస్తోంది. కేంద్రంపై ధాన్యం కొనుగోళ్ల విషయంలో పోరు జరుపుతున్నారు. కానీ కేంద్రం ధాన్యం విషయంలో ఎప్పటికప్పుడు స్పందించడం చూస్తే టీఆర్ఎస్ కు యాంటిగానే గాలులు వీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర నాయకులు స్పందించకుండా కేంద్ర నుంచి ప్రకటనలు ఇప్పించడం… రాజకీయ వ్యూహంలో భాగమేనని అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి సంతరించుకుంది. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే కేబినెట్ విస్తరణ లేకపోవచ్చని అంటున్నారు. అయితే బండప్రకాశ్ లాంటి నాయకులను కేవలం మంత్రి పదవి కోసమే తీసుకున్నారని అంటున్నారు.ఈ సమయంలో వారి నుంచిఎలాంటి స్పందన వస్తుందోనని అనుకుంటున్నారు.

Also Read: కాంగ్రెస్ కు నేతలే శాపమా?