https://oktelugu.com/

Jobs: సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో భారీగా జాబ్స్.. రాతపరీక్ష లేకుండా?

Jobs: సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ డేటా అనలిస్ట్, అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 144 ఉండగా డేటా అనలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 6 ఉన్నాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 18, 2022 / 09:12 AM IST
    Follow us on

    Jobs: సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ డేటా అనలిస్ట్, అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 144 ఉండగా డేటా అనలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 6 ఉన్నాయి.

    Jobs

    స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

    Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతున్న కొరటాల శివ

    2022 సంవత్సరం మే 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://cris.org.in/crisweb/design1/index.jsp వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో మేలు జరగనుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.35,400 నుంచి రూ.67,700 వరకు వేతనంగా లభించనుంది.

    2022 సంవత్సరం మే 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్ పాస్ కావడంతో పాటు 2022 గేట్ స్కోర్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

    Also Read: Prabhas: RRR మూవీ చూసి ఘోరంగా ఏడ్చేసాను