yash: కేజీఎఫ్-2 సంచలనాలు ఇంకా ఆగట్లేదు. కన్నడ సినిమా చరిత్రను మార్చేసిన ఈ మూవీ.. ఇండియన్ మూవీగా మారి బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడాలు లేకుండా అంతటా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ఈ మూవీలో ఒక్కో సీన్ గూస్ బంప్స్ అన్నట్టే ఉన్నాయి. ముఖ్యంగా మేకింగ్ అయితే మరో లెవల్ లో ఉందనే చెప్పుకోవాలి. మరి ప్రశాంత్ నీల్‌కు ఇది ఎలా సాధ్యమైందనేదే ఇక్కడ ప్రశ్న.
మొన్న ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోలు తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటే మూవీ మేకింగ్‌కు ఎక్కువ ఖర్చు పెట్టొచ్చని తద్వారా కేజీఎఫ్ లాంటి వండర్స్ ఇంకా చాలానే వస్తాయని చెప్పారు. అవును ఆయన చెప్పింది నిజమే. కేజీఎఫ్ విషయంలో జరిగింది ఇదే. కేజీఎఫ్ మూవీ మేకింగ్ చూస్తే బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా పనిచేయవు.
అంత రిచ్ గా, వండర్ అనేంతలా మేకింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీకి హీరో రెమ్యునరేషన్ చాలా తక్కువే. కేజీఎఫ్-1 అంత పెద్ద హిట్ అయినా కూడా.. చాప్టర్-2కి యష్ తీసుకుంది రూ.30 కోట్లే. డైరెక్టర్ ప్రశాంత్ రూ.15 కోట్లు, సంజయ్ దత్ రూ.9 కోట్లు తీసుకున్నారు. మొత్తం సినిమా బడ్జెట్ 20శాతం కూడా వీరి రెమ్యునరేషన్ లేదన్నమాట.
అందుకే సినిమాకు మిగతా బడ్జెట్ మొత్తం పెట్టి అంత అద్భుతంగా తీయగలిగారు. అదే టాలీవుడ్ హీరోల విషయానికి వస్తే.. మూవీ బడ్జెట్‌లో 40శాతం వారి రెమ్యునరేషన్ కే పోతోంది. మొన్న త్రిబుల్ ఆర్ విషయంలో ఇదే జరిగింది. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అయితే రూ.100కోట్ల దాకా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్‌లో రూ.60కోట్లకు మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు ఐదారుగురు దాకా ఉన్నారు. మన హీరోలు కూడా ఇలా రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమాను మరింత అద్భుతంగా తీయొచ్చని మేకర్స్ చెబుతున్నారు.
కేజీఎఫ్ లాంటి వండర్‌ను తెరకెక్కించడానికి ప్రశాంత్ నీల్‌కు ఇదే ప్లస్ పాయింట్ అయింది. మూవీ మేకింగ్‌కే అధికంగా బడ్జెట్ కేటాయించారు. దాంతో ఆ మూవీ ఎలా వచ్చిందో చూశాం. ఇంకేముంది ఇండియన్ బాక్సాఫీస్ నెత్తిన కూర్చుంది. మరి మన టాలీవుడ్‌లో ఇలాంటి వండర్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.
Also Read:Shivathmika Rajashekar: తెల్లటి గౌనులో అందాల విందు పంచిన స్టార్ హీరో కూతురు.. వైరల్