https://oktelugu.com/

Jobs: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?

Jobs: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 69 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు జరగనుంది. railtelindia.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 18, 2022 / 12:58 PM IST
    Follow us on

    Jobs: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 69 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు జరగనుంది. railtelindia.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

    రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు కాగా మిగిలిన వాళ్లకు దరఖాస్తు ఫీజు 1200 రూపాయలుగా ఉంది. ఫిబ్రవరి నెల 23వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష జరగనుండగా ఈ పరీక్షలో 150 మార్కుల మల్లిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయని సమాచారం. https://www.railtelindia.com/images/careers/final%20vacancy%20notice-including%20backlog.pdf?ref=inbound_article వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    railtelindia.com వెబ్ సైట్ లో కెరీర్స్ ట్యాబ్ ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్హత, సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఇతర ధృవీకరణ పత్రాల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

    కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు మత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.