Homeఎంటర్టైన్మెంట్Telugu Heroines: శ్రీదేవి తర్వాత ఆ ఫీట్ అందుకున్న హీరోయిన్స్ వీరే !

Telugu Heroines: శ్రీదేవి తర్వాత ఆ ఫీట్ అందుకున్న హీరోయిన్స్ వీరే !

Telugu Heroines:  అతిలోక సుందరిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని ఏలారు శ్రీదేవి. వెండితెరపై తిరుగులేని చరిత్ర లిఖించిన శ్రీదేవి కేవలం 13 ఏళ్లకే హీరోయిన్ గా మారారు. టీనేజ్ కూడా దాటకుండా శ్రీదేవి కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఆధిపత్యం చెలాయించారు. అయితే శ్రీదేవి మాదిరి టీనేజ్ కూడా పూర్తి కాకుండానే చాలా మంది అమ్మాయిలు హీరోయిన్స్ గా మారారు. వారిలో కొందరు స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 18 ఏళ్ళు నిండకుండానే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన 10 మంది ఎవరో చూద్దాం…

Krithi Shetty
Krithi Shetty

చాలా చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టిన కృతి శెట్టి టీనేజ్ పూర్తి కాకుండానే హీరోయిన్ గా మారారు. కృతి శెట్టి మొదటి చిత్రం ఉప్పెన గత ఏడాది విడుదల కాగా అప్పటికి ఆమె వయసు 17 ఏళ్లు మాత్రమే.

Also Read:  రోహిత్ రంగంలోకి.. కోహ్లీకి అసలే చోటే ఉండదట?
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ 16 ఏళ్లకే ముఖానికి మేకప్ వేసుకుంది. హీరోయిన్ గా ఛార్మి మొదటి చిత్రం ‘నీతోడు కావాలి’. 2002లో ఆ చిత్రం విడుదల కాగా… అప్పటికి ఛార్మి వయసు 15 సంవత్సరాలు.

Charmy Kaur
Charmy Kaur

టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని పదిహేనేళ్లుగా ఏలేస్తుంది తమన్నా. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న తమన్నా 15 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆమె మొదటి చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా 2005లో విడుదలైంది.

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ హన్సిక మోత్వానీ దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా మారారు. దేశముదురు 2007లో విడుదల కాగా… అప్పటికి హన్సిక వయసు కేవలం 16.

Hansika Motwani
Hansika Motwani

కొత్త బంగారులోకం(2008) మూవీలో శ్వేతా బసు నటనను అప్పటి యువత అసలు మర్చిపోలేరు. ఈ బెంగాలీ భామ కొత్త బంగారులోకం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి శ్వేతా వయసు 17ఏళ్ళు.

Also Read: రాత్రి సమయంలో వేడి నీళ్లు తాగితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?

అక్కినేని వారసుడు అఖిల్ డెబ్యూ చిత్రం అఖిల్(2015) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సయేశా సైగల్ వయసు 17 సంవత్సరాలు మాత్రమే.

Sayesha Saigal
Sayesha Saigal

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగులో కూడా పాపులారిటీ తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ అవికా గోర్. ఈ ముద్దుగుమ్మ ఉయ్యాలా జంపాలా(2013) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా అప్పుడు అవికా వయసు 16.

ప్రేమకథ మూవీతో పాపులారిటీ తెచ్చుకున్న నందితాజ్ రాజ్ మొదటి చిత్రం నీకు నాకు డాష్ డాష్(2012). ఈ సినిమా చేసేనాటికి నందిత వయసు 17ఏళ్ళు మాత్రమే.

Ulka Gupta
Ulka Gupta

2015లో విడుదలైన ఆంధ్రా పోరీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఉల్కా గుప్తా అప్పటి వయసు 17ఏళ్ళు.

Shriya Sharma
Shriya Sharma

గాయకుడు మూవీ 2015లో విడుదలైంది. ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా శర్మ అప్పటి ఏజ్ 17 ఏళ్ళు.

Also Read:Laxmiparvathi: ‘ఎన్టీఆర్ ఆత్మ కనపడిందట.. మాట్లాడిందట..’ లక్ష్మీపార్వతీ ఏంటమ్మా ఇదీ!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version