కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇతర రంగాలతో పోలిస్తే వైద్య రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మందులతో పాటు వైద్య పరికరాల ఉత్పత్తి గురించి ప్రత్యేక దృష్టి పెట్టాయి. హిమాచల్ ప్రదేశ్ లో 277 కోట్ల రూపాయలతో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

మొత్తం 277 కోట్ల రూపాయలతో ఈ పార్కును ఏర్పాటు చేయనుండగా కేంద్రం 100 కోట్ల రూపాయల ఖర్చును భరిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్ల రూపాయల ఖర్చును భరించనుంది. ఈ పార్కు ఏర్పాటు కోసం సోలన్ జిల్లాలోని 265 హెక్టార్లలో భూమిని ఎంపిక చేశారు. 10,000 కంటే ఎక్కువ మందికి ఈ పార్కు ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటు కొరకు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పార్కు ద్వారా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఈ పార్కు ద్వారా ఉత్పత్తి అయ్యే పరికరాలను దేశంలోని వేర్వేరు ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారని తెలుస్తోంది. స్కానింగ్ మెషీన్లు, పల్స్ ఆక్సీమీటర్లు, వెంటిలేటర్లను ఈ పార్కులో ఏర్పాటైన కంపెనీలు తయారు చేయనున్నాయని తెలుస్తోంది.
దేశీయంగా పల్స్ ఆక్సీమీటర్, వెంటిలేటర్లు, స్కానింగ్ మిషన్లు తయారు చేయడం వల్ల వీటి ధరలు సైతం తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. దేశీయంగా అవసరాలకు తగిన విధంగా వీటిని ఉత్పత్తి చేసుకోనున్నారని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుంది.