Jobs: విశాఖ‌ప‌ట్నం కో ఆప‌రేటివ్ బ్యాంక్‌ లో ఉద్యోగ ఖాళీలు.. రూ.35 వేల వేతనంతో?

Jobs: ది విశాఖ‌ప‌ట్నం కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీఎల్‌) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 20 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 12, 2022 9:26 am
Follow us on

Jobs: ది విశాఖ‌ప‌ట్నం కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీఎల్‌) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 20 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలుగు, ఇంగ్లీష్ భాషలు చదవడం, మాట్లాడటంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 2021 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా 35,000 రూపాయల వేతనం లభించనుంది.

https://www.vcbl.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 11వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.vcbl.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష జరగనుండగా 25 మార్కులను ఇంటర్వ్యూకు కేటాయిస్తారని సమాచారం. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా గ్రాడ్యుయేషన్ లో పాసై తెలుగు, ఇంగ్లీష్ భాషలు చదవడం వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.