Sankranthi 2022:  భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా?

Sankranthi 2022:  హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. హిందువుల పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతి పండుగను సూర్యుడు ఒక రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాలలో ఈ పండుగను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో మూడు […]

Written By: Navya, Updated On : January 12, 2022 9:20 am
Follow us on

Sankranthi 2022:  హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ సమయంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. హిందువుల పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతి పండుగను సూర్యుడు ఒక రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజున జరుపుకోవడం జరుగుతుంది.

ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాలలో ఈ పండుగను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటే మరికొన్ని ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సమయంలో కొన్ని ప్రాంతాలలో కోడి పందేలు జరుగుతాయి. ధనుర్మాసం చివరి రోజున భోగి పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ రోజున తాటి ఆకులను ఉపయోగించి భోగి మంటలు వేస్తారు.

భోగి మంటలలో పాత సామాన్లను వేసి ఆ మంటల్లో కాచిన వేడి నీటితో స్నానం చేయాలి. పాత వస్తువులను మంటల్లో వేయడం ద్వారా అవసరం లేని వస్తువులపై ప్రేమ ఉండకూడదని అర్థం చేసుకోవచ్చు. భోగి రోజున బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. చిన్నపిల్లలపై పండుగ రోజున భోగి పళ్లను పోసి ఆశీర్వదిస్తారు. సంక్రాంతి పండుగను పంటల పండుగ అని కూడా చాలామంది పిలుస్తారు. భగవంతుని అనుగ్రహం వల్లే పంట చేతికి వస్తుంది కాబట్టి భగవంతునికి తొలి నివేదన చేసేవరకు పంటను ఇంటి అవసరాలకు వాడుకోరు.

మూడో రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను పశువుల పండుగ అనే పేరుతో కూడా పిలుస్తారు. కనుమ రోజున పశు పక్షాదులను పూజించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ రోజున పశువుల కొమ్ములకు రంగులు వేస్తారు. కనుమ రోజున మినప గారెలు, మాంసాహారం తింటారు. కనుమ పండుగ రోజున ప్రయాణాలు చేయడం మంచిది కాదు.