Jobs: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 4 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పీహెచ్‌డీ డిగ్రీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్/ స్లెట్ అర్హత సాధించిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
2022 సంవత్సరం జనవరి 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంటుంది. https://uohyd.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.