https://oktelugu.com/

Tamanna: వరుణ్ తేజ్‌ తో తమన్నా రొమాన్స్.. ఇది నిజంగా సర్ ప్రైజే !

Tamanna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా నుంచి జనవరి 15వ తేదీ ఉదయం 11 గంటల 8 నిమిషాలకు సెకండ్ సాంగ్ రాబోతుంది. అయితే, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ఈ ‘కొడితే’ సాంగ్ లో నటించి అందరికీ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది సిజ్లింగ్ బ్యూటీ తమన్నా. ఈ స్పెషల్ సాంగ్ లో వరుణ్ తేజ్‌ తో కలిసి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 12, 2022 / 12:04 PM IST
    Follow us on

    Tamanna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా నుంచి జనవరి 15వ తేదీ ఉదయం 11 గంటల 8 నిమిషాలకు సెకండ్ సాంగ్ రాబోతుంది. అయితే, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ఈ ‘కొడితే’ సాంగ్ లో నటించి అందరికీ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది సిజ్లింగ్ బ్యూటీ తమన్నా. ఈ స్పెషల్ సాంగ్ లో వరుణ్ తేజ్‌ తో కలిసి రొమాన్స్ చేసింది ఈ ముదురు బ్యూటీ. మొత్తానికి తమన్నా ఈ సాంగ్ లో నటించడంతో గని సినిమా పై అంచనాలు పెరిగాయి.

    tamanna

    ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో ఫైట్ చేయబోతున్నాడు. వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.

    మరి గనితో వరుణ్ తేజ్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి. అయితే, ఈ సినిమా మరో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మొదటిసారిగా నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సినిమా అవుట్ ఫుట్ బాగానే వచ్చింది అని టాక్ ఉంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌ పై ఈ సినిమా వస్తోంది.