https://oktelugu.com/

Jobs: ఐఐటీ కాన్పూర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ.. నెలకు రూ.2 లక్షల వేతనంతో?

Jobs: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కాన్పూర్ మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ సంస్థ 4 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రిన్సిపల్‌ ఆర్‌ఈవో, సీనియర్‌ ఆర్‌ఈవో, ఆర్‌ఈవో(గ్రేడ్‌1) ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌ఈవో ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా […]

Written By: Kusuma Aggunna, Updated On : January 13, 2022 10:13 am
Follow us on

Jobs: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కాన్పూర్ మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ సంస్థ 4 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రిన్సిపల్‌ ఆర్‌ఈవో, సీనియర్‌ ఆర్‌ఈవో, ఆర్‌ఈవో(గ్రేడ్‌1) ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌ఈవో ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

పీహెచ్డీ, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ చేసిన వాళ్లతో పాటు బీటెక్, బీఈ, బీఎస్ చదివిన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు సంబంధిత పనిలో తప్పనిసరిగా అనుభవం ఉండాలి. 2022 సంవత్సరం జనవరి 14వ తేదీ నాటికి 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఐఐటీ కాన్పూర్ అర్హత ఉన్నవారికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పని అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక ప్రక్రియను చేపడతారు. https://www.iitk.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.

నెలకు రూ.2 లక్షల రూపాయలకు పైగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు లభించనుందని సమాచారం. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ 4 ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి.