Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల పంచాయతీ తేలడం లేదు. ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో టీడీపీ కూడా జనసేనతో కలిసేందుకు ఉత్సాహం చూపిస్తోందని తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నా ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు కుదురుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో రాష్ర్టంలో పొత్తులు ఎటు వైపు దారి తీస్తాయో అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
2019 ఎన్నికల తరువాత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కార్యకర్తల అభీష్టం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగానే ఆయన పొత్తుకు వెళ్లినట్లు అప్పట్లో విమర్శలు వచ్చినా పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు. దీంతో ఇన్నాళ్లు బీజేపీతోనే స్నేహం ఉన్నాఎక్కడ కూడా రెండు పార్టీలు కలిసి పోరాటం చేసిన సందర్భాలు మాత్రం లేవు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికలో పోరాడినా ఫలితం మాత్రం రాలేదు.
Also Read: భోజనం చేసిన తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా.. ప్రాణాలకే ప్రమాదమట!
రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా? లేక బీజేపీతోనే కలిసి నడుస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్రంతో జత కట్టేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీకి టీడీపీకి మాత్రం సఖ్యత లేదని తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో అనే సంశయాలు అందరిలో నెలకొంటున్నాయి.
మరోవైపు జనసేనకు కేడర్ లేదని వస్తున్న విమర్శల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో జత కట్టేందుకు టీడీపీ ముందుకు వస్తున్నా దానిపై పవన్ స్పష్టత ఇవ్వడం లేదు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జత కడతారా? లేక బీజేపీతోనే కొనసాగుతారా అనేది తేలాల్సి ఉంది. ఏదిఏమైనా రాష్ర్టంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది.
Also Read: రజనీ నుంచి కార్తీ వరకూ.. తమిళ సంపన్నులైన హీరోల లిస్ట్ ఇదే !