Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విశేష అనుభవం ఉంది. నలభై ఏళ్ల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు. అపర చాణక్యుడిగా పేరుగాంచిన బాబు ప్రస్తుతం శత్రువుల పీడ వెంటాడుతోంది. ఇన్నాళ్లు ఏకచత్రాధిపత్యం వహించిన ఆయనకు పక్కలో బళ్లెంలా శత్రువులు మారారు. గతంలోనే ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు మధ్య పెద్ద రాజకీయ దుమారం రేగి కాపుల కోసం పోరాడిన ముద్రగడతో బాబుకు చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం కూడా కాపులను టీడీపీకి దూరం చేయాలనే కోణంలో ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాపులకు రాజకీయ అవకాశాలు కావాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గతంలోనే దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కాపులను ఐక్యం చేసి టీడీపీకి వ్యతిరేకంగా తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈనేపథ్యంలో కాపులను ఐక్యం చేసి టీడీపీకి ఓటు వేయకుండాచేయాలనేదే ఆయన ప్రధాన ఉద్దేశంత. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి నష్టమే కలగనుంది. ఇందుకోసం ముద్రగడ ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: చంద్రబాబుతో పొత్తు.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్
మరోవైపు గంటా శ్రీనివాస్ రావు కూడా కాపు ఓట్లను తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కాపుల ఓట్లతోనే అధికారంలోకి రావాలని ఇద్దరు నేతలు చూస్తున్నారు వీరి ప్రధాన శత్రువు కూడా బాబే కావడం గమనార్హం. దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు రాబట్టుకోవడం కష్టంగానే మారనుంది. ఇది ముమ్మాటికి వైసీపీకి మేలు జరిగేలా కనిపిస్తోంది.
చంద్రబాబును అధికారంలోకి రానీయకుండా చేయడమే ప్రధానంగా ఈ ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి ఓట్లు రాకుండా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాపు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి కాకుండా చేయడమే వీరి ముందున్న టాస్క్ గా కనిపిస్తోంది. మొత్తానికి చంద్రబాబుకు శత్రవులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గద్దెనెక్కకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: యాక్షన్ డైరెక్టర్ లో యాక్షనే కాదు, ఎమోషనూ ఉంది !Corona fund: కరోనా ఫండ్ నుంచి కేంద్రం ఒక్కొక్కరికి రూ.5 వేలు.. నిజమేంటంటే?