https://oktelugu.com/

బెల్ సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. బీఈ, బీటెక్ అర్హతతో?

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. 73 అప్రెంటీస్ జాబ్స్ కొరకు బెల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సీ.ఎస్.ఈ, ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. బీఈ, బీటెక్, డిప్లొమా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2021 / 03:40 PM IST
    Follow us on

    భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. 73 అప్రెంటీస్ జాబ్స్ కొరకు బెల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సీ.ఎస్.ఈ, ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. బీఈ, బీటెక్, డిప్లొమా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    మొత్తం ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 63 ఉండగా డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు బీఈ, బీటెక్ ఖచ్చితంగా పాసై ఉండాలి. 2019, 2020, 2021 సంవత్సరాలలో బీఈ, బీటెక్ పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు నెలకు 11,100 రూపాయలు స్టైఫండ్ పొందే ఛాన్స్ ఉంటుంది.

    టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 2019, 2020, 2021 సంవత్సరాలలో డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 10,400 రూపాయల వేతనం లభిస్తుంది. డిప్లొమా, బీఈ/బీటెక్‌ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాట్స పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 10వ తేదీ చివరి తేదీగా ఉండగా బెల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 25వ తేదీ చివరి తేదీగా ఉండనుంది.