ప్రామిస‌రీ నోట్ రాస్తున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..?

ప్రస్తుత కాలంలో మనిషి మాట కన్నా ఒక ప్రామిస‌రీ నోటుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఎవరి దగ్గర నుంచి అయినా మనం అప్పుగా పెద్ద మొత్తంలో నగదును తీసుకున్నప్పుడు అందుకు సాక్ష్యంగా ఈ ప్రామిసరీ నోటును రాయించుకుంటారు. అయితే ఈ ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు జరిగిన ఈ ప్రామిసరీ నోటు చెల్లదు. అలా చెయ్యని పక్షంలో మనం ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బులు మొత్తం […]

Written By: Kusuma Aggunna, Updated On : November 3, 2021 5:35 pm
Follow us on

ప్రస్తుత కాలంలో మనిషి మాట కన్నా ఒక ప్రామిస‌రీ నోటుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఎవరి దగ్గర నుంచి అయినా మనం అప్పుగా పెద్ద మొత్తంలో నగదును తీసుకున్నప్పుడు అందుకు సాక్ష్యంగా ఈ ప్రామిసరీ నోటును రాయించుకుంటారు. అయితే ఈ ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు జరిగిన ఈ ప్రామిసరీ నోటు చెల్లదు. అలా చెయ్యని పక్షంలో మనం ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బులు మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది. మరి ప్రామిసరీ నోట్ రాయించుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

*మొదటగా ప్రామిసరీ నోట్ రాయించుకోవాలంటే రాయించుకున్న వారికి రాయించి ఇచ్చిన వారికి తప్పనిసరిగా 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.

*ప్రామిసరీ నోట్ తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా అప్పు ఇచ్చిన వారు తీసుకున్న వారు పక్కన ఉండి ప్రామిసరీ నోటు రాయించుకోవాలి. ఒకసారి ప్రామిసరీ నోటు రాయించిన తర్వాత అది కేవలం మూడు సంవత్సరాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతుంది. అనంతరం కొత్త ప్రామిసరీ నోట్ రాయించుకోవాలి.

*ఇలా రాయించుకున్న ప్రామిసరీ నోటు పై కచ్చితంగా రూపాయి విలువ చేసే స్టాంప్ అతికించి అడ్డంగా సంతకం పెట్టాలి. ఇలా ప్రామిసరీ నోటు పై సుమారు కోటి రూపాయల వరకు అప్పుగా పొందవచ్చు.ఇలా ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు ఉంటే తప్పనిసరిగా లాయర్ ను సంప్రదించి వాటిని చూసుకోవాలి

*ముఖ్యంగా ప్రామిసరీ నోట్ రాయించుకున్న వారు నేను ఫలానా వ్యక్తి దగ్గర ఇంత పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నాను దానిని నేను తిరిగి ఇస్తాను అని లేకపోతే ఆ ప్రామిసరీ నోటుచెల్లెదు కనక ప్రామిసరీ నోట్ రాయించుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలి.