Wipro Recruitment: ప్రముఖ సంస్థ విప్రోలో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Wipro Recruitment: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన విప్రో ఫ్రెషర్స్ కు తీపికబురు అందించింది. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పేరుతో విప్రో గ్రాడ్యుయేట్ల నియామకానికి సిద్ధమైంది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. గత మూడేళ్లలో ఇంజనీరింగ్ పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. […]

Written By: Kusuma Aggunna, Updated On : December 28, 2021 5:34 pm
Follow us on

Wipro Recruitment: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన విప్రో ఫ్రెషర్స్ కు తీపికబురు అందించింది. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పేరుతో విప్రో గ్రాడ్యుయేట్ల నియామకానికి సిద్ధమైంది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. గత మూడేళ్లలో ఇంజనీరింగ్ పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Wipro Recruitment

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 3.5 లక్షల రూపాయల వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు అగ్రిమెంట్ ఉంటుందని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు 2022 – 2023 సంవత్సరాలలో ఉద్యోగాల కోసం చేరాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

Also Read: Jobs: నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

https://app.joinsuperset.com/company/wipro/elite-national-talent-hunt.html వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌, బీఈ లేదా ఎంటెక్/ఎంఈ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. పది,ఇంటర్ ఫుల్ టైం కోర్సులు చదిదిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 10, ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

బీటెక్ లో 6 సీజీపీఏ లేదా 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు. ఆన్ లైన్ అసెస్ మెంట్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Also Read: Jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో జాబ్స్.. రాతపరీక్ష లేకుండా?