https://oktelugu.com/

Bheemla Nayak: ఉస్తాద్​ లెక్కున్నాడుగా.. ‘భీమ్లానాయక్​’ కొత్త పోస్టర్​పై నెటిజన్లు కామెంట్స్​

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 10:24 AM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్​ను సృష్టిస్తున్నాయి.

    Bheemla Nayak

    తాజాగా, పవన్​కు సంబంధించినకొత్త పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. ఈ పోస్టర్​లో పవన్ లుంగి పైకి మడతపెడుతూ.. ఆవేశంతో నడుస్తున్న లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఉస్తాద్ లెక్కున్నాడంటూ కొందరు పోస్ట్​ చేయగా.. పవర్​కి మీనింగ్​ ఈ కటౌట్​ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సినిమా వాయిదా పడ్డా.. కాస్త ఆలస్యమైనా.. పవన్​ పవర్​ మాత్రం అల్టిమేట్​ అని మరోసారి రుజువైంది.

    Also Read: NTR and Charan: ఎన్టీఆర్, చరణ్ లలో గొప్ప గుణాల సీక్రెట్స్ చెప్పిన రాజమౌళి

    కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన భీమ్లా నాయక్ సాంగ్​ రికార్డులను సృష్టిస్తోంది. మరోవైపు రానా విభిన్న పాత్రలో కనిపించనుడటంతో ఈ సినిమాపై మరింత హైప్​ క్రియేట్ అయ్యింది. మరి చూడాలి ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం రీచ్ అవుతుందో అని.

    Also Read: Pushpa Collections: ‘పుష్ప’ 5 రోజుల బాక్సాఫీస్ ఫుల్ కలెక్షన్స్ ఇవే !