Revanth Reddy: వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంది. టీఆర్ఎస్ మంత్రులను ఢిల్లీకి పంపించి, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. కాగా, తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్‌తో వరి ధాన్యం విషయంలో కేసీఆర్‌యే టార్గెట్ అయ్యారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే సీన్ ఉంది. తాజాగా ఎవరూ ఊహించని విధంగా రేవంత్ సరికొత్త నినాదాన్ని తెలంగాణ రాజకీయ వర్గాల్లోకి తీసుకొచ్చారు. తన వ్యవసాయ కేత్రంలో కేసీఆర్.. వరి ఎందుకు పండిస్తున్నారనే ప్రశ్నను లేవనెత్తారు. అంతటితో ఆగకుండా తాను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లిలోనూ రైతులతో సభ పెట్టి.. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకున్నారు. అందుకుగాను
ముందుకు సాగుతున్న క్రమంలో టీఆర్ఎస్ సర్కారు కాంగ్రెస్ పార్టీ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసింది. అలా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాడే విషయంలో కొంత మేరకు అయినా సక్సెస్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.
యాసంగిలో రైతులు వరి పండించొద్దని, వరి పెడితే ఉరే అన్నట్లు టీఆర్ఎస్ సర్కారు హెచ్చరించింది. ఈ సమయంలోనే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలపైన ఫోకస్ పెట్టేందుకు ఫోకస్ చేస్తున్నారు కూడా. కాగా, కేసీఆర్ తన ఫామ్ హౌజ్‌లో మళ్లీ వరి పండిస్తున్నారని రేవంత్ ప్రచారం చేయడంతో ప్రజల్లో ఆలోచన అయితే వస్తున్నది.
Also Read: Rythu Bandhu: తెలంగాణ రైతులకు సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ!
అలా రైతుల దృష్టిని తన వైపునకు మరల్చడంలో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ సక్సెస్ అయ్యారని డిస్కషన్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. రేవంత్ ప్రశ్నలకు ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు కాని లేదా కేసీఆర్ కాని కంపల్సరీగా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కేసీఆర్‌ను టార్గెట్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే టాక్ కూడా ఉంది.
Also Read: Electricity Charges Hike: తెలంగాణ ప్రజలకు ‘షాక్’ ఇవ్వబోతున్న కేసీఆర్