
దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం అంతాఇంతా కాదు. దేశంలోని పరిశ్రమలపై, అన్ని రంగాలపై కరోనా మహమ్మారి ప్రభావం పడింది. కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇతర రంగాలతో పోలిస్తే విద్యా రంగంపై ఈ ప్రభావం అధికంగా పడింది. చాలా పాఠశాలలు ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించాయి.
Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?
కొన్ని పాఠశాలలు ఉద్యోగాల నుంచి తొలగించకపోయినా జీతాలు మాత్రం ఇవ్వలేమని తేల్చి చెబుతున్నాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు నడవకపోవడం వల్ల దేశంలో లక్షల సంఖ్యలో టీచర్లు నిరుద్యోగులయ్యారు. ఎవరైనా జీతాల గురించి స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే స్కూళ్లు నడవకుండా జీతాలు ఎలా చెల్లిస్తామనే సమాధానం వినిపిస్తోంది.
పని చేస్తున్న టీచర్లకు సైతం పలు ప్రాంతాల్లో గతేడాది ఇచ్చిన జీతంతో పోలిస్తే తక్కువ జీతం ఇస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. పలువురు టీచర్లు పడుతున్న కష్టాలు జగన్ సర్కార్ దృష్టికి రావడంతో ప్రభుత్వం ఈ ఘటనలపై సీరియస్ అయింది. దీంతో జగన్ సర్కార్ పలు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు పంపింది.
పశ్చిమగోదావరి జిల్లా డీఈవో జిల్లాలో టీచర్ల నుంచి ఫిర్యాదులు అందిన కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారని… పాఠశాలలు నడవనంత మాత్రాన జీతాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారని తెలుస్తోంది. జీతాలు చెల్లించని పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని సమాచారం.
Also Read : కేంద్రంలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం..