ప్లే స్టోర్ నుంచి పేటీఎం మాయం.. డబ్బు సేఫేనా?

దేశంలో ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎంకు గూగుల్ షాక్ ఇచ్చింది. పేటీఎం యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు సంబంధించి రూపొందించిన కొత్త నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్. Also Read: డిజిటల్ మీడియా గొంతు నొక్కేందుకు కేంద్రం ప్లాన్? గూగుల్ ప్రోడక్ట్స్, అండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ వైఎస్ ప్రెసిడెంట్ సుజేన్ ఫ్రే కొత్త గైడ్ లైన్స్ […]

Written By: NARESH, Updated On : September 18, 2020 4:30 pm

paytm

Follow us on

దేశంలో ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎంకు గూగుల్ షాక్ ఇచ్చింది. పేటీఎం యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు సంబంధించి రూపొందించిన కొత్త నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్.

Also Read: డిజిటల్ మీడియా గొంతు నొక్కేందుకు కేంద్రం ప్లాన్?

గూగుల్ ప్రోడక్ట్స్, అండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ వైఎస్ ప్రెసిడెంట్ సుజేన్ ఫ్రే కొత్త గైడ్ లైన్స్ ను బ్లాగ్ పోస్టులో వెల్లడించిన కొన్ని గంటల్లోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించడం సంచలనమైంది. గూగుల్ పాలసీలను ఉల్లంఘించినప్పుడు యాప్ ను తొలగించి డెవలపర్ కు సమాచారం ఇస్తామని.. ఆన్ లైన్ క్యాసినో, స్పోర్ట్స్ బెట్టింగ్ లాంటి వాటిని గూగుల్ ప్రోత్సహించదని.. ఇది నిర్వహిస్తున్న పేటీఎంను అందుకే తొలగించామని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.

అయితే ఇప్పటికే పేటీఎం యాప్ ఉపయోగిస్తున్న వారికి వచ్చిన ముప్పేమీ లేదు. వారి వ్యాలెట్ లోని డబ్బులను ఎప్పటిలాగే ఉపయోగించుకోవచ్చు. కొత్తగా పీటీఎం యాప్ డౌన్ లోడ్ చేయడానికి మాత్రం ఉండదు. యాప్ ఉన్న వారు అప్ డేట్ చేయడం కూడా కుదరదు.

Also Read: కుప్పకూలడానికి రెడీగా బీజేపీ సర్కార్?

మళ్లీ గూగుల్ గైడ్ లైన్స్ ప్రకారం యాప్ లో మార్పులు చేసిన తర్వాతే పేటీఎం యాప్ ప్లేస్టోర్ లోకి వస్తుంది.

కాగా ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించడంపై ఆ సంస్థ స్పందించింది. పేటీఎం అండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదు. కొత్త పేటీఎం యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి, అప్ డేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పేటీఎం యూజర్ల డబ్బులు భద్రంగానే ఉన్నాయని.. మీ పేటీఎం లావాదేవీలు ఎప్పట్లగానే చేసుకోవచ్చని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది.