https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. ఈ కోర్సులు చేస్తే జాబ్ గ్యారంటీ..?

భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ కోర్సును పూర్తి చేస్తుంటే అదే సమయంలో వేల సంఖ్యలో మాత్రమే కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు కరోనా, బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు కొత్త ఉద్యోగం కోసం వెతికే వాళ్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే నిపుణులు మాత్రం కొన్ని కోర్సులు చేస్తే ఉద్యోగాలు గ్యారంటీ అని చెబుతున్నారు. Also Read: అమ్మాయిలకు శుభవార్త.. రూ.25,000 స్కాలర్ షిప్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 8, 2021 12:09 pm
    Follow us on

    IT Industry

    భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ కోర్సును పూర్తి చేస్తుంటే అదే సమయంలో వేల సంఖ్యలో మాత్రమే కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు కరోనా, బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు కొత్త ఉద్యోగం కోసం వెతికే వాళ్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే నిపుణులు మాత్రం కొన్ని కోర్సులు చేస్తే ఉద్యోగాలు గ్యారంటీ అని చెబుతున్నారు.

    Also Read: అమ్మాయిలకు శుభవార్త.. రూ.25,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

    గతేడాది కరోనా మహమ్మారి వల్ల అన్ని రంగాలు దెబ్బ తిన్నా ఐటీ రంగం లాభాలను సాధించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఉద్యోగులు సైతం ఎటువంటి ఇబ్బందులు పడకుండా విధులను నిర్వర్తించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులు ఎక్కువ సమయం అందుబాటులో ఉండటంతో పాటు పనులు వేగంగా జరగడంతో ఐటీ కంపెనీలు ఈ ఏడాది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

    Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఛాయిస్..?

    ఏవియేషన్, టూరిజం, ట్రావెల్ కు సంబంధించిన ప్రాజెక్టులు ఎక్కువగా ఐటీ రంగానికి చెందిన కంపెనీలకు వచ్చాయి. కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు సైతం కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలటిక్స్, ఆటోమేషన్ కు సంబంధించి ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటున్నాయి.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    ఈ కోర్సులు చేస్తే జాబ్ కచ్చితంగా వస్తుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో నైపుణ్యాలు లేని ఉద్యోగులు మాత్రమే ఉద్యోగాలు కోల్పోయారని నైపుణ్యం ఉన్నవాళ్లు ఫ్రెషర్స్ అయినా ఉద్యోగాలు సులభంగా పొందే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.