Job: ఉద్యోగం ఉంటేనే గౌరవమా? ఎంత నిజం?

సాధారణంగా సమాజంలో ఉద్యోగం చేసే వారికి ప్రత్యేకంగా గౌరవాన్ని ఇస్తారు. ఎందుకంటే దాన్న ఓ అలంకారంగా మారిపోయింది. ఈ కారణంగానే జాబ్స్ చేసే వారికి మర్యాద ఇస్తుంటారు.

Written By: Swathi Chilukuri, Updated On : March 5, 2024 2:17 pm

Job

Follow us on

Job: ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగాన్ని చేస్తున్నారు.. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం చేయాల్సిందేనా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే చదువుతో సంబంధం లేకుండా కూడా జాబ్స్ చేసే వాళ్లు ఉన్నాయి. కానీ అసలు ఎవరినైనా ఉద్యోగం ఉంటేనే గౌరవిస్తారా? లేకపోతే? అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా సమాజంలో ఉద్యోగం చేసే వారికి ప్రత్యేకంగా గౌరవాన్ని ఇస్తారు. ఎందుకంటే దాన్న ఓ అలంకారంగా మారిపోయింది. ఈ కారణంగానే జాబ్స్ చేసే వారికి మర్యాద ఇస్తుంటారు. అంతేకాదు పెళ్లి వంటి శుభకార్యాలు జరగాలన్న అబ్బాయి లేదా అమ్మాయి ఉద్యోగం చేస్తున్నారా? బాగా సంపాదిస్తున్నారా? అనే అడిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ జాబే లేకపోతే గౌరవాన్ని ఇవ్వకపోగా మనల్ని మనుషులుగా కూడా చూడరన్నది అందరికీ తెలిసిన సత్యమే.

ఉద్యోగం లేకపోయినా కుటుంబం కోసం చేసే ఎలాంటి పని అయినా గౌరవాన్ని కలిగి ఉంటుంది. నిరంతరం నీతి నిజాయితీతో చేసే ఏ పని అయినా గొప్పదే అవుతుందన్న సత్యాన్ని ప్రస్తుత సమాజంలో చాలా మంది గుర్తించలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఉద్యోగం ఉన్న వారిని ఓ విధంగా, ఉద్యోగం లేని వారిని మరో విధంగా చూడటం ఇప్పటికైనా మానుకోవాలి..

కుటుంబంలో వెలుగును నింపేందుకు అడుగులు వేస్తున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతేకానీ వారిని అడ్డుకోవడం, అవమానించడం సరికాదు. అలాగే చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగస్తులకు ఏ మాత్రం తక్కువ కాకుండా సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. తక్కువ విద్యార్హత ఉందని, చదువుకోలేదని చీకటిలో ఉండిపోనవసరం లేదు. ఉద్యోగం చేసినా, చెయ్యకపోయినా కష్టపడి పని చేసే వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తుండాలి.