https://oktelugu.com/

బీటెక్ పాసైన వాళ్లకు గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండా రైల్వే సంస్థలో..?

దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే బీటెక్ పూర్తి చేసిన వాళ్లలో కొంతమందికి మాత్రమే అర్హతకు తగిన ఉద్యోగాలు వస్తున్నాయి. బీటెక్ పూర్తి చేసిన వాళ్లకు రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థలలో ఒకటైన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. ఈ సంస్థ 74 వర్క్స్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో 304 ఉద్యోగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 28, 2021 / 01:00 PM IST
    Follow us on

    దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే బీటెక్ పూర్తి చేసిన వాళ్లలో కొంతమందికి మాత్రమే అర్హతకు తగిన ఉద్యోగాలు వస్తున్నాయి. బీటెక్ పూర్తి చేసిన వాళ్లకు రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థలలో ఒకటైన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. ఈ సంస్థ 74 వర్క్స్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో 304 ఉద్యోగ ఖాళీలు..?

    ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 18 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://ircon.org/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. 74 వర్క్స్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు సివిల్, ఎస్ అండ్ టీ విభాగాలలో ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే కావడం గమనార్హం.

    Also Read: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

    అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 74 ఖాళీలలో వర్క్స్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగ ఖాళీలు 60 ఉండగా వర్క్స్ ఇంజనీర్ ఎస్ అండ్ టీ ఉద్యోగ ఖాళీలు 14 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్స్ ఇంజనీర్ ఎస్ అండ్ టీ పోస్టుకు గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

    30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను 1 : 7 ప్రకారం కేటగిరీ వారీగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 36,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది.