https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో 304 ఉద్యోగ ఖాళీలు..?

ప్రముఖ సంస్థలలో ఒకటైన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నెల రోజుల క్రితం 67 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్‌ఎండీసీ నుంచి నోటిఫికేషన్ విడుదల కాగా తాజాగా ఎన్‌ఎండీసీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read: బీటెక్ పాసైన వాళ్లకు గుడ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 28, 2021 / 01:14 PM IST
    Follow us on

    ప్రముఖ సంస్థలలో ఒకటైన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నెల రోజుల క్రితం 67 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్‌ఎండీసీ నుంచి నోటిఫికేషన్ విడుదల కాగా తాజాగా ఎన్‌ఎండీసీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: బీటెక్ పాసైన వాళ్లకు గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండా రైల్వే సంస్థలో..?

    అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 304 ఉద్యోగ ఖాళీలలో ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 65, మైంటనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ మెకానికల్ ఉద్యోగ ఖాళీలు 148, మైంటనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 81 ఉన్నాయి. ఈ ఉద్యోగాలు కాకుండా ఇతర ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి.

    Also Read: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసై ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కుడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి 2021 సంవత్సరం ఏప్రిల్ 15 చివరి తేదీగా ఉంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవానికి తగిన వేతనం లభిస్తుంది. ఐటీఐ పాసైన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.