దుబాయ్ సెన్సార్ రివ్యూ: వకీల్ సాబ్ లో ఆ సీన్స్ చూస్తే పిచ్చెక్కుతుందట

  రెండుమూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసిన మూవీ ‘వకీల్ సాబ్’. రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ తీసిన ఈ మూవీపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్సే కాకుండా టాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది. ‘వకీల్ సాబ్’ త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే దుబాయ్ లోని సెన్సార్ బోర్డు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేసిందట. అక్కడి సెన్సార్ బోర్డుకు చెందిన ఉమర్ సందు […]

Written By: NARESH, Updated On : March 28, 2021 11:53 am
Follow us on

 

రెండుమూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసిన మూవీ ‘వకీల్ సాబ్’. రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ తీసిన ఈ మూవీపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్సే కాకుండా టాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది.

‘వకీల్ సాబ్’ త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే దుబాయ్ లోని సెన్సార్ బోర్డు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేసిందట. అక్కడి సెన్సార్ బోర్డుకు చెందిన ఉమర్ సందు అనే వ్యక్తి సినిమాను పార్ట్స్ గానే చూసి ఉత్సాహంగా ఫీలయ్యాడట.

హిందీలో పింక్ అనే సినిమా విజయవంతం కావడంతో తెలుగులో ‘వకీల్ సాబ్’ను రీమేక్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా తెలుగు నేటివిటీకీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు..  విలక్షన నటుడు ప్రకాశ్ రాజు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్స్ ఇప్పటికే ఆదరణ పొందాయి.

తాజాగా ఈ సినిమా దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్స్ చూసి క్లీన్ చీట్ ఇచ్చినట్టు తెలిసింది.  వీరిలో ఒకరైన ఉమర్ సందు సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడట. ఫ్యాన్స్ అంచనాల కంటే మించి ఈ సినిమా ఉందని అంటున్నాడు. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్ ల మధ్య జరిగే సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బాంబ్స్ తెప్పించడం ఖాయమంటున్నారు..  ఈ సినిమాలోని ఎమోషన్ సీన్లు, నివేధా తామస్ కంటతడి పెట్టిస్తుందని చెబుతున్నారు.