ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 513 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్, జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్, ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 150 రూపాయలు కాగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 1,05,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. 2021 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాతపరీక్ష జరుగుతుంది. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంది.