అమెజాన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. నెలరోజుల డీల్స్?

ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో భాగంగా తాజగా తేదీలను ప్రకటించింది. అక్టోబర్ నెల 4వ తేదీన ఈ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ముందుగానే డీల్స్ అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఫ్లిప్ కార్ట్ వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్ ను నిర్వహించనుంది. అమెజాన్ కస్టమర్లకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ […]

Written By: Navya, Updated On : September 25, 2021 10:22 am
Follow us on

ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో భాగంగా తాజగా తేదీలను ప్రకటించింది. అక్టోబర్ నెల 4వ తేదీన ఈ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ముందుగానే డీల్స్ అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఫ్లిప్ కార్ట్ వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్ ను నిర్వహించనుంది.

అమెజాన్ కస్టమర్లకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలపై భారీగా డిస్కౌంట్లను అందించనుందని తెలుస్తోంది. కిండ్లే, ఫైర్ స్టిక్, అమెజాన్ ఎకో డివైజ్ లను కూడా తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు చెందిన వెయ్యికి పైగా ఉత్పత్తులను గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ లో భాగంగా లాంఛ్ చేయనున్నారని సమాచారం. హెచ్డీఎఫ్సీ కార్డు ఉన్న కస్టమర్లకు స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

హెచ్.డీ.ఎఫ్.సీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఈ.ఎం.ఐ లావాదేవీలపై ఏకంగా 10 శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు నో కాస్ట్ ఈ.ఎం.ఐతో పాటు క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. దసరా, దీపావళి పండుగ కానుకగా అమెజాన్ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. అమెజాన్ నెల రోజుల పాటు ఈ సేల్ ను నిర్వహిస్తుండటం గమనార్హం.

అమెజాన్ ఇప్పటికే డెలివరీ మౌఖిక సదుపాయాలను సైతం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. అమెజాన్ ఏకంగా నెల రోజుల పాటు సేల్ ను నిర్వహిస్తుండటంతో కస్టమర్లకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.