నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..!

ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, రైల్వే శాఖ నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రైల్వే అనుబంధ శాఖలు సైతం నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. రైల్వే వీల్ ప్లాంట్ 70 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఓవర్ టైమ్ చేస్తే డబుల్ జీతం..? […]

Written By: Kusuma Aggunna, Updated On : December 31, 2020 10:48 am
Follow us on


ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, రైల్వే శాఖ నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రైల్వే అనుబంధ శాఖలు సైతం నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. రైల్వే వీల్ ప్లాంట్ 70 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఓవర్ టైమ్ చేస్తే డబుల్ జీతం..?

డిప్లొమా ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2021 సంవత్సరం జనవరి 14 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. అప్రెంటీస్ ట్రైనింగ్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీటెక్ లేదా బీఎస్సీ లేదా డిప్లొమా సంబంధిత బ్రాంచ్ లలో ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రాతపరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

రాత పరీక్ష లేదు కాబట్టి మార్కుల మెరిట్ ద్వారానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లలో డిప్లొమా చేసిన వాళ్లు సైతం ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హతను బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ చేపడుతూ ఉండటంతో మెరిట్ ఉన్న విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.