Indian Navy Jobs: ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పెళ్లి కాని స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. మొత్తం 155 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఇందులో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉద్యోగ ఖాళీలు 93 ఉన్నాయని సమాచారం అందుతోంది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్, జనరల్ సర్వీస్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టెక్నికల్ నైపుణ్యాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. 1998 సంవత్సరం నుంచి 2003 సంవత్సరం మధ్యలో జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?
ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం మార్చి 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది.
Also Read: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆరంభం.. బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్పాట్ లు ఇక భస్మీపటలమేనా?