AP BJP Leaders: ఆంధ్రప్రదేశ్ లో పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అధికార పార్టీ వైసీపీపై విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని దాడి చేయాలని చూస్తున్నా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు దీంతో ఎంత ప్రతిష్ట పెంచుకోవాలని చూస్తున్నా అది నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు నరసింహారావు, సోము వీర్రాజు లాంటి వారు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నా కనీసం గుర్తించడం లేదు. దీంతో బీజేపీకి రాష్ట్రంలో గుర్తింఉ లేదని తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. మీట నొక్కి సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన ఏదో జరిగిందని అనుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలను మాత్రం ఎవరు లెక్క చేయడం లేదు. దీంతో వారిలో ఆగ్రహం వస్తోంది. తాము ఎంత చేస్తున్నా ఇంత దారుణంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో ఆంతర్యమేమిటో వారికి అంతు చిక్కడం లేదు కానీ ఏపీలో బీజేపీకి అంత పట్టు ఉన్నట్టు మాత్రం కనిపించడం లేదని అర్థమవుతోంది.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?
రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని ఇప్పటికే లక్షల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబడుతున్నారు. కానీ టీడీపీతో జత కట్టినప్పుడు బీజేపీ మాత్రం తక్కువ చేసిందా అనే థోరణిలో వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలాగైనా రాష్ట్రంలో తమదైన ముద్ర వేసి అధికారం దక్కించుకోవాలంటే సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. రాష్ట్రంలో వైసీపీని లక్ష్యంగా చేస్తున్నా ఎక్కడ కూడా వారికి మద్దతు లభించడం లేదు.
మీట నొక్కి డబ్బులు ఇస్తున్న జగన్ రాష్ట్రంలో పనులు మాత్రం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజల ఖాతాల్లో నగదు జమ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని విమర్శించినా ఎవరు కూడా వారి వ్యాఖ్యలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.దీంతో బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఎలాగైనా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని చూసినా వారే బలహీనపడుతున్నారు తప్ప వైసీపీకి మాత్రం ఏం కావడం లేదు.
స్వయంగా కాగ్ అక్షింతలు వేసినా సరే వైసీపీకి ఏ ఢోకా లేనట్లుగా కనిపిస్తోంది. మరోపక్క కేంద్రమే అప్పులు తీసుకునేందుకు అనుమతులు ఇస్తోంది. దీంతో బీజేపీ నేతలకు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. ఓ పక్క విమర్శలు చేస్తూ మరోపక్క సాయం చేయడంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో పాగా వేయాలనే బీజేపీ కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
Also Read: కేసీఆర్ మీడియాపై పడ్డ బీజేపీ.. మూసేస్తుందా?