హత్య కేసు నిందితులు వారే..?: మిస్టరీ ఛేదించిన పోలీసులు

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామగిరి మండలం కల్వచర్ల శివారులో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మంథనికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్వచర్ల శివారులో మిట్ట మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మంథని నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతులు ప్రయాణిస్తున్న […]

Written By: Srinivas, Updated On : February 18, 2021 10:37 am
Follow us on


పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామగిరి మండలం కల్వచర్ల శివారులో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మంథనికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్వచర్ల శివారులో మిట్ట మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మంథని నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతులు ప్రయాణిస్తున్న కారును దుండగులు అడ్డగించి విచక్షణా రహితంగా కత్తులతో దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అడ్వకేట్ దంపతులను స్థానికుల సహాయంతో 108 వాహనంలో పెద్దపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్దరూ చనిపోయారు.

Also Read: టీడీపీ పతనం ఖాయమట.. జాతీయ మీడియా సంచలన నిజాలు

ఈ హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. వివాదాల నేపథ్యంలోనే న్యాయవాద దంపతులను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు.. వీరి హత్యకు పాల్పడిన కుంటా శ్రీనివాస్‌, అతని ఇద్దరు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఆలయం నిర్మాణం వ్యవహారంలో కుంటా శ్రీనివాస్‌కు, వామనరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి. అదేకాకుండా.. శీలం రంగయ్య లాకప్ డెత్ కేసుకు సంబంధించి హైకోర్టులో వామన్ రావు, నాగమణి పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టులో ఈ కేసులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌‌ను విచారణాధికారిగా నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసును వాపస్ తీసుకోవాలంటూ గుర్తు తెలియని దుండగులు వామనరావు, నాగమణిలను బెదిరించారు.

ఈ నేపథ్యంలో తమకు ప్రాణ హానీ ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణి ఫిర్యాదు చేశారు. కాగా, ఇవాళ ఆలయ నిర్మాణానికి సంబంధించి కుంటా శ్రీనివాస్‌పై పెద్దపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వామనరావు దంపతులు వచ్చారు. ఇది తెలుసుకున్న నిందితులు బ్రెజ్జా కారులో వచ్చి రామగిరి మండలం కలవచర్లలో మధ్యాహ్నం 2.30 సమయంలో వామనరావు దంపతులిద్దరిపై కత్తులతో దాడి చేసి చంపేశారు.

Also Read: రెడ్డప్ప.. ఇలా మారావు ఏంటబ్బా?

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. కుంటా శ్రీనివాస్ సహా అతని ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, వామనరావు దంపతుల మృతిపై తెలంగాణ బార్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Check this Space For More information on Andhra Pradesh Political News