https://oktelugu.com/

ఐఎండీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే..?

ఇండియా మెటీయోరాలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 54 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా ఐఎండీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. https://mausam.imd.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పాటు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: గంటకు 1,700 రూపాయల వేతనం.. ఉద్యోగం ఏమిటంటే..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 24, 2021 / 08:39 PM IST
    Follow us on

    ఇండియా మెటీయోరాలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 54 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా ఐఎండీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. https://mausam.imd.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పాటు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: గంటకు 1,700 రూపాయల వేతనం.. ఉద్యోగం ఏమిటంటే..?

    మొత్తం 54 ఉద్యోగాలలో సైంటిస్ట్ సి, సైంటిస్ట్ డి, సైంటిస్ట్ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన వెలువడినప్పటి నుంచి 42 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైంటిస్ట్ సి ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా సైంటిస్ట్ డి, సైంటిస్ట్ ఈ ఉద్యోగాలకు 50 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి గ్రామానికి ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్..?

    కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ చదివి సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోర్‌కాస్టింగ్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, కంప్యూట‌ర్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇండియాలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంట్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 67,700 రూపాయల నుంచి 2,09,200 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.