జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేశం వచ్చినా అనుగ్రహం వచ్చినా రెండింటిని కంట్రోల్ చేయడం కష్టంగానే ఉంది. నిన్ననే ప్రకాశం జిల్లా జనసేన కార్యకర్త ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్యేను, సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాన్ ఈరోజు అదే నోటితో సీఎం జగన్ ను కృతజ్ఞతలు తెలుపడం హాట్ టాపిక్ గా మారింది.
దివీస్ పరిశ్రమను రద్దు చేయాలని మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ పెద్ద పోరాటమే చేశారు. అక్కడికి వెళ్లి మరీ ఆందోళన చేశారు. దివీస్ కాలుష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా.. 36మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో గ్రామస్థుల్లో భయాందోళన వ్యక్తమైంది. అరెస్ట్ అయిన వారికి బెయిల్ రావడానికి సహకరించిన అందరికీ జనసేన తరుఫున పవన్ కృతజ్ఞతలు తెలిపారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు.
తాజాగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయమై లేఖను విడుదల చేశారు. ‘దివీస్ కర్మాగారంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని.. వారి సమస్యలను సైతం జగన్ పరిష్కరించాలని కోరారు.
దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషం కలిగించిందని పవన్ అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టుకు, సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.