https://oktelugu.com/

కల వల్ల కోటీశ్వరురాలైన మహిళ.. ఎలా అంటే..?

ఎంతో అదృష్టం ఉంటే మాత్రమే రాత్రికి రాత్రి కోటీశ్వరులం అవ్వడం సాధ్యం అవుతుంది. ఒక మనిషి 340 కోట్ల రూపాయలు సంపాదించడం అంటే తేలిక కాదు. అయితే అదృష్టం ఉంటే మాత్రం అంత భారీ మొత్తం సంపాదించడం తేలికేనని ఒక మహిళ ప్రూవ్ చేసింది. కల ద్వారా ఆ మహిళ కోటీశ్వరురాలు అయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఘటన కెనడాలో చోటు చేసుకుంది. నిద్రలో వచ్చిన కల జాక్ పాట్ తగిలేలా చేసింది. Also Read: ట్రైలర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 25, 2021 / 07:43 AM IST
    Follow us on

    ఎంతో అదృష్టం ఉంటే మాత్రమే రాత్రికి రాత్రి కోటీశ్వరులం అవ్వడం సాధ్యం అవుతుంది. ఒక మనిషి 340 కోట్ల రూపాయలు సంపాదించడం అంటే తేలిక కాదు. అయితే అదృష్టం ఉంటే మాత్రం అంత భారీ మొత్తం సంపాదించడం తేలికేనని ఒక మహిళ ప్రూవ్ చేసింది. కల ద్వారా ఆ మహిళ కోటీశ్వరురాలు అయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఘటన కెనడాలో చోటు చేసుకుంది. నిద్రలో వచ్చిన కల జాక్ పాట్ తగిలేలా చేసింది.

    Also Read: ట్రైలర్ టాక్: ‘జాతిరత్నాల’ సినిమా కష్టాలు

    పూర్తి వివరాల్లోకి వెళితే 20 సంవత్సరాల క్రితం కెనడాకు చెందిన ఒక వ్యక్తికి నిద్రపోతున్న సమయంలో కలలో కొన్ని నంబర్లు కనిపించాయి. ఆ వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తరువాత తనకు వచ్చిన కల గురించి, నిద్రలో కనిపించిన నంబర్ల గురించి భార్య డెంగ్ ప్రవతౌదమ్ కు చెప్పాడు. అది లాటరీ నంబర్ అయి ఉంటుందని భావించిన ఆ మహిళ ఒంటారియో లాటరీ అండ్ గేమింగ్ లో గత 20 సంవత్సరాలుగా పాల్గొంటూ వచ్చింది.

    Also Read: జీమెయిల్ అకౌంట్ వాడుతున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

    అయితే లాటరీ ద్వారా డబ్బులు రాకపోయినా మహిళ నిరాశ చెందలేదు. ఓర్పుతో మహిళ ప్రయత్నం చేయగా తాజాగా ఆమెకు కలలో వచ్చిన నంబర్లు కాసుల వర్షం కురిపించాయి. ఓఎల్‌జీ మహిళ లాటరీ ద్వారా మన కరెన్సీ ప్రకారం 340 కోట్ల రూపాయలు గెలుచుకున్నట్టు ప్రకటన చేసింది. డెంగ్ ప్రవతౌదమ్ లాటరీ గెలవడం గురించి స్పందిస్తూ డబ్బు గెలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

    మరిన్ని వార్తల కోసం: వైరల్

    గతేడాది విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల తన ఉద్యోగం కూడా పోయిందని ఇలాంటి సమయంలో లాటరీ గెలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. 40 సంవత్సరాలుగా భర్త లేబర్ గా పని చేస్తున్నాడని.. ఈ డబ్బుతో ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు పిల్లల ఫీజులను చెల్లించనున్నామని తెలిపారు.