Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(Deputy CM Pawan Kalyan) అయ్యాక సినీ నిర్మాతలకు అసలు అందుబాటులోకి రావడం లేదు. ప్రస్తుతం ఆయన చేతుల్లో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడిట్లో రెండు సినిమాలు చివరి దశలో ఉన్నాయి. ఆ రెండు సినిమాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie). ఈ చిత్రం ఎప్పుడో కరోనా లాక్ డౌన్ ముందు మొదలైంది. ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడం తో షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ లాక్ డౌన్ ఎత్తేసాక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ ని పూర్తి చేయడానికి సమయం కేటాయించాడు. ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’ కి రెండు నెలల సమయం కేటాయించాడు. అప్పుడే దాదాపుగా 80 షూటింగ్ పూర్తి అయ్యింది. మిగిలిన 20 శాతం షూటింగ్ పూర్తి చేయడానికి నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్.
Also Read : హరి హర వీరమల్లు మీ ఊహకి మించి ఉంటుంది : ఏ ఏం రత్నం…
సెప్టెంబర్ నెలలో షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టి ఒక పది రోజుల పాటు పాల్గొన్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి డిసెంబర్ లో రెండు రోజుల షూటింగ్ చేసాడు. అంతే, ఇక ఈ సినిమాని పట్టించుకోలేదు. కేవలం నాలుగు రోజుల సమయం కేటాయిస్తే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవుతుంది. కానీ ఆయన ఇవ్వడం లేదు. ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసి చాలా రోజులైంది. పోస్టర్స్ మీద ఇప్పటికీ ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటనలు కొట్టించారు. కానీ ఎవ్వరికీ అధికారిక సమాచారం ఇవ్వలేదు. నిజంగా ఈ చిత్రం ఈ నెలలో విడుదల అవుతుంటే, ఈపాటికి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యేవి. కానీ ఆ ఊసే దరిదాపుల్లో లేదు. ఒక్క సెంటర్ లో కూడా బిజినెస్ ని క్లోజ్ చేయలేదు. దీని అర్థం ఈనెలలో ఈ చిత్రం విడుదల లేనట్టే.
నిన్న జరిగిన ‘మ్యాడ్ 2′(Mad Square) మూవీ ప్రెస్ మీట్ లో ఆ చిత్ర నిర్మాత నాగవంశీ(Naga vamsi) కూడా ఈ విషయాన్ని దాదాపుగా ఖరారు చేసాడు. మీ సినిమాని ‘హరి హర వీరమల్లు’ కి పోటీగా దింపుతున్నారా అని ఒక విలేఖరి అడుగగా, దానికి వంశీ సమాధానం ఇస్తూ ‘ హరి హర వీరమల్లు చిత్రం మార్చ్ 28న కచ్చితంగా వస్తుందని వేణు గారు (పవన్ కళ్యాణ్ పీఆర్) మాకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆ సినిమా విడుదలైతే కచ్చితంగా మా ‘మ్యాడ్ 2′ చిత్రాన్ని వాయిదా వేస్తాము. హరి హర వీరమల్లు లేకపోతేనే మా సినిమా మార్చ్ 29 న విడుదల అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే ‘హరి హర వీరమల్లు’ చెప్పిన డేట్ కి రావడం లేదని నాగవంశీ ఖరారు చేసినట్టే అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది.
Also Read : హరి హర వీరమల్లు’ విడుదల తేదీపై వీడిన సస్పెన్స్..సంచలన ప్రకటన చేసిన నిర్మాత ఏఎం రత్నం!