ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. పది, ఇంటర్ అర్హతతో..?

విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఏపీకి చెందిన నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీకి చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా సోల్జర్‌- జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌- టెక్నికల్‌, సోల్జర్‌- టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌, సోల్జర్‌ – క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం […]

Written By: Navya, Updated On : June 23, 2021 11:32 am
Follow us on

విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఏపీకి చెందిన నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీకి చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా సోల్జర్‌- జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌- టెక్నికల్‌, సోల్జర్‌- టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌, సోల్జర్‌ – క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఆన్ లైన్ లో ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జూన్ నెల 20వ తేదీ నుంచి ఆగష్టు నెల 3వ తేదీ వరకు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. http://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, 10వ తరగతి, సంబంధిత సబ్జెక్టులతో 10+2/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉండాలి.

17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మిగిలిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం.

ఆగస్టు 16 నుంచి ఆగస్టు 31 వరకు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరుగుతుందని సమాచారం అందుతోంది. ఏపీలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం లో ర్యాలీని నిర్వహిస్తారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.