మోదీ సర్కార్ శుభవార్త.. కరోనాతో మరణిస్తే ప్రతి నెలా డబ్బులు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈఎస్ఐ స్కీమ్‌ లో చేరిన వాళ్లకు తీపికబురు అందించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈఎస్ఐ స్కీమ్‌లో చేరిన వాళ్లు కరోనా వల్ల మృతి చెందితే వాళ్ల కుటుంబాలకు కేంద్రం ప్రతి నెలా పెన్షన్ అందించనుంది. ఈఎస్‌ఐ లబ్ధిదారులు కరోనా సోకి చనిపోతే వాళ్ల కుటుంబాలకు నెలకు కనీసం 1800 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర కార్మిక శాఖ నుంచి ఈ మేరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం […]

Written By: Navya, Updated On : June 23, 2021 11:28 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈఎస్ఐ స్కీమ్‌ లో చేరిన వాళ్లకు తీపికబురు అందించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈఎస్ఐ స్కీమ్‌లో చేరిన వాళ్లు కరోనా వల్ల మృతి చెందితే వాళ్ల కుటుంబాలకు కేంద్రం ప్రతి నెలా పెన్షన్ అందించనుంది. ఈఎస్‌ఐ లబ్ధిదారులు కరోనా సోకి చనిపోతే వాళ్ల కుటుంబాలకు నెలకు కనీసం 1800 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కేంద్ర కార్మిక శాఖ నుంచి ఈ మేరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. కేంద్రం ఈ అంశానికి సంబంధించి ప్రజల సలహాలు, సూచనలు కోరుతున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ స్కీమ్ కు అర్హత సాధించాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు మరణించే సమాయానికి మూడు నెలల ముందే ఆన్ లైన్ పోర్టల్ లో రిజిష్టర్ చేసుకొని ఉండాలి.

అలా 3 నెలల ముందే రిజిష్టర్ చేసుకున్న వాళ్ల కుటుంబ సభ్యులు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందడానికి అర్హులవుతారు. లబ్ధిదారుల కుటుంబానికి చెందిన అర్హత కలిగిన సభ్యుని బ్యాంక్ ఖాతాలో పెన్షన్ డబ్బులను నేరుగా జమ చేయడం జరుగుతుంది. కేంద్రం అంత్యక్రియలకు సంబంధించి 15,000 రూపాయలు అందించడం జరుగుతుంది. కేంద్రం కరోనా సోకి చికిత్స చేయించుకుంటున్న వాళ్లకు సైతం చికిత్స కాలంలో వేతనం చెల్లిస్తుంది.

కేంద్రం ఈఎస్ఐ స్కీమ్‌లో చేరిన వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్ణయాల వల్ల ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు, వాళ్ల కుటుంబ సభ్యులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.