https://oktelugu.com/

విద్యార్థులకు శుభవార్త.. రూ.20,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

దేశంలోని చాలా మంది విద్యార్థులు ఇంటర్ తరువాత మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ లలో కెరీర్ ను ఎంచుకుంటున్నారు. అయితే సామాన్య, మధ్యతరగతి వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులు మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ లకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉండటంతో చదువుకు దూరమవుతున్నారు. అయితే మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలనే ఆసక్తి ఉన్నవారికి బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ స్కాలర్ షిప్ ను అందజేస్తోంది. డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్‌షిప్ పేరుతో బడ్డీ 4 స్టడీ ఇండియా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 26, 2021 / 08:11 PM IST
    Follow us on

    దేశంలోని చాలా మంది విద్యార్థులు ఇంటర్ తరువాత మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ లలో కెరీర్ ను ఎంచుకుంటున్నారు. అయితే సామాన్య, మధ్యతరగతి వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులు మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ లకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉండటంతో చదువుకు దూరమవుతున్నారు. అయితే మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలనే ఆసక్తి ఉన్నవారికి బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ స్కాలర్ షిప్ ను అందజేస్తోంది.

    డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్‌షిప్ పేరుతో బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ అందిస్తున్న ఈ స్కాలర్ షిప్ ను ప్రతిభ ఉన్న విద్యార్థులు పొందవచ్చు. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారు 20,000 రూపాయలు స్కాలర్ షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు చెందిన ప్రజలు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబ వార్షికాదాయం 3 లక్షల రూపాయల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు కూడా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెడిసిన్, ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఇన్‌కమ్ సర్టిఫికెట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, 12వ తరగతి మార్క్స్ షీట్, పాస్ బుక్ లేదా క్యాన్సల్డ్ చెక్ కాపీ ఉంటే మాత్రమే ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్ పాసైన విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.