https://oktelugu.com/

ఎట్టకేలకు.. 19 నెలలకు.. కేసీఆర్ సారొచ్చాడు!

తాను నచ్చింద రంభ.. తాను మునిగింద గంగా అని కొందరు మొండిగా ముందుకెళుతుంటారు.. కేవలం వాస్తు సరిగా లేదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా సచివాలయంలో అడుగు పెట్టలేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలకు సచివాలయం ఒకటే కావడంతో కేసీఆర్ కొత్తసచివాలయం కలలు నెరవేరలేదు. అయితే జగన్ ఏపీలో సీఎం అయ్యాక ఒప్పించి మెప్పించి పాత భవనాలు కూలగొట్టి కొత్త సచివాలయ నిర్మాణాలకు రెడీ అయ్యారు. అయితే 2019 జూన్ లో కేసీఆర్ కొత్తసచివాలయానికి భూమి పూజ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 26, 2021 / 08:21 PM IST
    Follow us on

    తాను నచ్చింద రంభ.. తాను మునిగింద గంగా అని కొందరు మొండిగా ముందుకెళుతుంటారు.. కేవలం వాస్తు సరిగా లేదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా సచివాలయంలో అడుగు పెట్టలేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలకు సచివాలయం ఒకటే కావడంతో కేసీఆర్ కొత్తసచివాలయం కలలు నెరవేరలేదు. అయితే జగన్ ఏపీలో సీఎం అయ్యాక ఒప్పించి మెప్పించి పాత భవనాలు కూలగొట్టి కొత్త సచివాలయ నిర్మాణాలకు రెడీ అయ్యారు.

    అయితే 2019 జూన్ లో కేసీఆర్ కొత్తసచివాలయానికి భూమి పూజ కూడా చేశాడు. కొత్త సచివాలయం పనులను ముంబైకి చెందిన షాపూరస్ జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకుంది. దాదాపు 617 కోట్లతో నూతన సచివాలయాన్ని తెలంగాణ సర్కార్ నిర్మిస్తోంది.

    అయితే కొత్త సచివాలయం వద్దంటూ కొందరు కోర్టుకు ఎక్కడం.. దానిపై పెద్ద ఎత్తున విచారణలు, అడ్డంకులు జరగడంతో దాదాపు 19 నెలలుగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది..

    అయితే ఈరోజు పరేడ్ గ్రౌండ్ లో జెండా పండుగకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ మధ్యలో ఉన్న సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. దాదాపు 19 నెలల తర్వాత కేసీఆర్ సచివాలయ ప్రాంగణానికి రావడం విశేషం. సచివాలయ నిర్మాణంలో వేగం పెంచాలని.. అత్యంత నాణ్యతతో చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రధాన గేట్, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను .. భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని కేసీఆర్ పరిశీలించారు.

    కొత్త సచివాలయాన్ని వచ్చే దసరాలోగా పూర్తిచేసి ఓపెనింగ్ చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్న ఈ క్రమంలోనే అన్న డేటు ప్రకారం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. వాస్తుసరిగా లేదని అసలు సచివాలయానికే రాని సీఎంగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కనీసం నిర్మాణ పనులకు కూడా ఇంత లేటుగా రావడం విశేషం.

    Tags