IIT Madras Summer Fellowship 2025
IIT Madras Summer Fellowship 2025 : దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో కీర్తి గడించింది మద్రాస్ ఐఐటీ. ఇందులో చదివిన విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కీలక స్థానాల్లో ఉన్నారు. ఇలాంటి యూనివర్సిటీ తాజాగా ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ముందుకు వచ్చింది. వేసవిలో తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండు నెలలపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంపై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ఫెలోషిప్‌కు అనర్హులు.
పెలోషిప్ ముఖ్య ఉద్దేశం
ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్సెస్, హుమానిటీస్ విభాగాల విద్యార్థుల్లో ఉన్నత నాణ్యతతో కూడిన అకడమిక్ రీసెర్చ్‌పై అవగాకన కల్పించడం, ఆసక్తి పెంపొందించడం. ఈ ఫెలోషిప్‌కు బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) మూడో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ ప్రోగ్రాంలలో మూడు/నాలుగో ఏడాది చదువుతున్నవారితోపాటు అకడమిక్ రికార్డు కలిగిన ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్ వ్యవధి :
ఎంపికైన విద్యార్థులకు రెండు నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుంది. మే 19వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు కోర్సు నిర్వహిస్తారు. ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15 వేల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారు. శిక్షణ కాలంలో హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. లభ్యతను బట్టి వసతి కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఫెలోషిప్‌లో పాల్గొనే ఇంజినీరింగ్ విభాగాలు ఇవే
ఏరోస్పేస్, అప్లయిడ్ మెకానిక్స్ అండ్ బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, డిజైన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటలర్జీకల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఓషన్ ఇంజినీరింగ్.
సైన్స్ విభాగంలో… ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ : మేనేజ్‌మెంట్ స్టడీస్
ఆన్‌లైన్‌లో దరఖాస్తు..
అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు, ఇతర దస్త్రాలను ఆన్‌లైన్ విధానంలో మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు అనుమతించరు. దరఖాస్తుదారులు తమ రిజిస్టర్డ్ ఈ– మెయిల్‌కు పంపిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఆధారంగా అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. అసంపూర్తిగా ఉన్న దరకాస్తును తిరస్కరిస్తారు. విద్యార్థులు కాలేజీ లేదా యూనివర్సిటీ హెడ్‌తో ధ్రువీకరించే లేఖ సమర్పించాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Iit madras launches summer fellowship program offers rs 15000 per month stipend if selected
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com