https://oktelugu.com/

IISC Recruitment: డిగ్రీ పాసైన విద్యార్థులకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్?

IISC Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలలో ప్రాజెక్ట్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలు 12 ఉండగా ఎలక్ట్రానిక్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్ ట్రెయినీ జాబ్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2021 / 10:34 AM IST
    Follow us on

    IISC Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలలో ప్రాజెక్ట్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలు 12 ఉండగా ఎలక్ట్రానిక్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్ ట్రెయినీ జాబ్స్ 2 ఉన్నాయి.

    IISC Recruitment

    ఏదైనా డిగ్రీ లేదా లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన వాళ్లు లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ట్రెయినీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం సెకండ్ క్లాస్ లో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. పాస్ అయిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    Also Read: విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.36,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్?

    2021 సంవత్సరం డిసెంబర్ నెల 14వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,000 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది.

    రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. https://www.iisc.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: ఏపీలోని కర్నూలులో మెడికల్‌ పోస్టుల భర్తీ.. ఎలా దరఖాస్తు చేయాలంటే?