జగన్ అధికారంలోకి వచ్చాక.. తన పథకాలను డోర్ టు డోర్ అందించేందుకు అక్కడి ప్రభుత్వం ఊరూరా వాలంటీర్లను నియమించింది. ఇప్పటికే వారే గ్రామస్థాయిలో ప్రజలకు పథకాలను చేరవేస్తున్నారు. ఏ పథకానికి ఎవరు అర్హులు..? ఎవరికి ఇవ్వాలనేది..? కూడా వారే ఫైనల్ చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వ పాలనలో ఇప్పుడు వాలంటీర్లదే హవా. వారిదే కీరోల్. అందుకే.. జగన్‌కు కూడా వారు మానస పుత్రులు అయ్యారు.
Also Read: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బోల్తా
అయితే.. ఇంత చేస్తున్నా తమ జీతాలు పెంచమని ఉద్యమిస్తున్న ఆ వాలంటీర్లకు మాత్రం జగన్ నుంచి శుభవార్త అందడం లేదు. ఆ ఒక్కటి చేయలేను కానీ.. సేవలకు ప్రతిఫలంగా బిరుదులు, సత్కారాలు చేస్తానంటూ ఆఫర్ ఇస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాలంటీర్లకు జీతాలు పెంచే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని నేరుగా చెప్పడం లేదు కానీ.. ఏడాది కిందట చెప్పిన రూ.ఎనిమిది వేలు కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని మాత్రం స్పష్టమైన సందేశాన్ని వాలంటీర్లకు పంపుతున్నారు. అయితే.. వారిని నిరాశపర్చకుండా ఉగాది రోజు సన్మానాలు. సత్కారాలు, బిరుదులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వాలంటీర్లు చేసేది స్వచ్ఛంద సేవా అని.. ఈ ఆదేశాలకు ఒక్కరోజు ముందే స్పష్టమైన బహిరంగ లేఖ రాశారు. ఎక్కువ చేస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదన్న నర్మగర్భ సంకేతాలు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే.. వారి సేవకు తగిన గుర్తింపును ఇస్తామని జగన్ చెబుతున్నారు. అందుకే వారికి ప్రత్యేకమైన బిరుదులను పంపిణీ చేయబోతున్నారు. కానీ.. వాటితో వాలంటీర్లకు ఏమైనా మేలు జరుగుతుందా. వాలంటీర్లలో ఉత్తమ వాలంటీర్లను ఎంపిక చేసి బిరుదులు, సత్కారాలు ఇచ్చినంత మాత్రాన ఆర్థికపరంగా ఎలాంటి లాభాలూ ఉండవు.
Also Read: బ్రేకింగ్: టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ఈమెనే.. ఆ సీనియర్ నేత కుమార్తెకు కేసీఆర్ అవకాశం
వాలంటీర్ల సేవలపై ప్రభుత్వానికి ఓ స్పష్టమైన అవగాహన ఉంది. వారేమీ పెద్దగా కష్టపడటం లేదన్న భావనలో ఉన్నారు. వారానికి మూడు రోజులు మాత్రమే పనిచేస్తున్నారని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అయితే.. రోజుకు అరగంట మాత్రమే వారికి పని ఉంటోందన్నారు. వైసీపీ పార్టీ నేతలు అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఓ వైపు జగన్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో లీడర్లు మాత్రం వాలంటీర్లను మరింత హేళను చేస్తూ మాట్లాడడం ఇబ్బందులకు గురిచేస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్