ICAR Recruitment 2021: ఐకార్ – నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. మొత్తం 66 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధం కావడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్, హైడ్రాలజీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సెల్ విభాగాలతో పాటు సర్వే వర్క్, జీఐఎస్ విభాగాల్లో కూడా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు పీ.హెచ్.డీ, ఎంటెక్, ఎమ్మెస్సీ పాసై ఉండాలి. 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఆన్ లైన్ ఇంటర్యూను నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియ చేస్తారు. https://www.nbsslup.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సెప్టెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుంది. https://www.nbsslup.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.