https://oktelugu.com/

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్… 2,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీలకు వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి విదితమే. తాజాగా 2,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2000 నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభించనుంది. Also Read: తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2020 12:01 pm
    Follow us on

    IB ACIO
    గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీలకు వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి విదితమే. తాజాగా 2,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2000 నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభించనుంది.

    Also Read: తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త.. ఆన్ లైన్ లో టెట్..?

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా జనవరి 9వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. https://www.mha.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.

    Also Read: ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు గడువు పొడిగింపు..?

    అభ్యర్థులు గరిష్టంగా మూడు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పరీక్ష కేంద్రాలుగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖ పట్నం, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు, కాకినాడలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి, ఆన్ లైన్ లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    మొత్తం 2000 ఖాళీలలో అన్ రిజర్వ్ డ్ అభ్యర్థులకు 989, ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులకు 113, ఓబీసీ అభ్యర్థులకు 417, ఎస్సీ అభ్యర్థులకు 360, ఎస్టీ అభ్యర్థులకు 121 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే https://www.mha.gov.in వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.