దేశంలో రోజురోజుకు ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ భాషను నేర్చుకోకపోతే ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు తగ్గుతాయి. దేశంలో చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఉన్నా సమయాభావం వల్ల, ఇతర కారణాల వల్ల నేర్చుకోలేకపోతున్నారు. రామకృష్ణ మఠం అలాంటి వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆన్ లైన్ ద్వారా రామకృష్ణ మఠం స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను నిర్వహిస్తోంది.
Also Read: డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?
రామకృష్ణ మఠం నిర్వాహకులు 2021 సంవత్సరం జనవరి నెల 9వ తేదీ నుంచి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ప్రారంభిస్తామని వెల్లడించారు. పదో తరగతి ఉత్తీర్ణులై 17 సంవత్సరాల వయస్సు పైబడిన వారు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులకు హాజరు కావడానికి అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే తరగతులకు హాజరు కావడానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..?
ఎవరైతే 1300 రూపాయలు చెల్లిస్తారో వాళ్లు ఆన్ లైన్ లో అడ్మిషన్ తో పాటు కోర్సు మెటీరియల్ ను పొందగలరు. శిక్షణ రుసుము చెల్లించిన వారికి పోస్ట్ ద్వారా స్టడీ మెటీరియల్ అందుతుంది. ప్రతి సంవత్సరం రామకృష్ణ మఠం ఆఫ్ లైన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను నిర్వహించగా ఈ సంవత్సరం మాత్రం ఆన్ లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తూ ఉండటం గమనార్హం.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
గ్రామాల్లో ఉండి చదువులో మంచి మార్కులు వస్తున్నా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేక ఇబ్బందులు పడుతున్న వాళ్లకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సులభంగా నివృత్తి చేసుకోవచ్చు.